Share News

ఖేలో ఇండియా గేమ్స్ విజయవంతం చేయాలి: అధికారులను ఆదేశించిన సంజయ్ జాజు

ABN , Publish Date - Sep 18 , 2026 | 08:10 PM

మన్వయంతో ఖేలో ఇండియా గేమ్స్ విజయవంతం చేయాలని అధికారులకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ నిర్వహణపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఖేలో ఇండియా గేమ్స్ విజయవంతం చేయాలి: అధికారులను ఆదేశించిన సంజయ్ జాజు

హైదరాబాద్, సెప్టెంబర్ 18: సమన్వయంతో ఖేలో ఇండియా గేమ్స్ విజయవంతం చేయాలని అధికారులకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ నిర్వహణపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మరో ఐదు నగరాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ నగరాలు.. హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మంలో నిర్వహిస్తామని వివరించారు.


18 ఏళ్ల లోపు క్రీడాకారులతో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 27 క్రీడా విభాగాల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. దాదాపు 6,050 మంది క్రీడాకారులు ఈ గేమ్స్‌లో పాల్గొంటారని సీఎస్ సంజయ్ జాజు పేర్కొన్నారు. 14 వ్యక్తిగత క్రీడలు.. 6 టీమ్ ఈవెంట్లు ఉంటాయని వివరించారు. మరో 6 ఇతర క్రీడా విభాగాల్లో పోటీలు కూడా ఉంటాయని చెప్పారు.


ఈ గేమ్స్ విజయవంతంగా నిర్వహించేందుకు 18 మందితో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్‌, అలాగే క్రీడా శాఖ మంత్రి కో-చైర్మన్‌గా ఉంటారని తెలిపారు. ఇక 28 మంది ఉన్నతాధికారులతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. మరో18 ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 08:44 PM