Share News

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:41 AM

చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఖమ్మం శాఖ అధ్యక్షుడు నల్లమల ఆనంద్‌ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Akshitha

  • ఓ కంపెనీలో కొలువు..

  • త్వరలో విధుల్లోకి..

  • అంతలోనే విషాదం

ఖమ్మం క్రైం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఖమ్మం శాఖ అధ్యక్షుడు నల్లమల ఆనంద్‌ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. భవితవ్యంపై కోటి ఆశలతో మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన ఆయన కూతురు అక్షిత (25).. ఎంఎస్‌ పూర్తి చేసుకుని ఇటీవలే ఓ కంపెనీలో కొలువు కూడా దక్కించుకున్నారు. త్వరలో విధుల్లో చేరడానికి సిద్ధమైన అక్షిత.. గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున) భోజనం చేసిన తర్వాత ఇంటి బయట వాకింగ్‌ చేస్తూ కుప్ప కూలిపోయి పోయారు. ఈ సంగతి గమనించిన ఆమె సోదరుడు అక్షయ్‌.. చికిత్స నిమిత్తం అక్షితను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.


ఆనంద్‌ దంపతుల కూతురు అక్షిత, కొడుకు అక్షయ్‌.. న్యూయార్క్‌ రాష్ట్రంలోని అల్బనీ నగరంలో నివాసం ఉంటున్నారు. అక్షిత దుర్మరణం వార్త తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు పూర్తిగా విషాదంలో మునిగిపోయారు. నల్లమల ఆనంద్‌ను పలువురు ప్రముఖులు, నాయకులు పరామర్శించారు. ఆనంద్‌కు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్‌ చేసి పరామర్శించడంతోపాటు ధైర్యం చెప్పారు. ఈ విషయమై ‘తానా’ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. శనివారం సాయంత్రానికి అక్షిత మృతదేహం ఖమ్మం నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తుమ్మల తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 06:41 AM