టీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్న పోలీసులు..
ABN , Publish Date - Jul 02 , 2026 | 09:48 AM
తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత భూపోరాట పిలుపుతో పోలీసుల అరెస్టులు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులను, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఈరోజు (గురువారం) ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో భూపోరాటానికి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులతో కలిసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోరాటం కొనసాగనుంది. ఈ మేరకు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.
అయితే, భూపోరాటానికి వెళ్తారనే సమాచారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దీంతో ముందస్తు అరెస్టులను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు, ఈరోజు ఉదయం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో భూపోరాటం జరిగే ప్రాంతానికి కల్వకుంట్ల కవిత చేరుకోనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు
సవాళ్లు - ప్రతి సవాళ్లు.. చర్చలకు సిద్ధమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు