అమెరికా వీసా రాలేదని.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 24 , 2026 | 06:34 AM
అమెరికా వీసా వస్తుందో రాదోనన్న ఆందోళనతో ఓ యువకుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గతంలో ఒకసారి దరఖాస్తు తిరస్కరణ
తీవ్ర మనోవేదనకు గురైన రోహిత్‌రెడ్డి
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఘటన
8 అత్తాపూర్ తేజస్వీనినగర్‌లో విషాదం
రాజేంద్రనగర్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అమెరికా వీసా వస్తుందో రాదోనన్న ఆందోళనతో ఓ యువకుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని అత్తాపూర్ తేజస్వీనినగర్‌లో జరిగింది. తేజస్వీనినగర్ కాలనీకి చెందిన చంద్రారెడ్డి, ఇందిరల కుమారుడు రోహిత్‌రెడ్డి (26) అమెరికాలో చదువుకోవడానికి గతంలో ఒకసారి వీసాకు దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురైంది.
దీంతో అతడు రెండోసారి వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈసారైనా వీసా వస్తుందో రాదోనని రోహిత్‌రెడ్డి కొద్దిరోజులుగా తీవ్ర మనోవేదనకు, ఆందోళనకు గురవుతున్నట్లు కుటుం బ సభ్యులు తెలిపారు. ఈ భయంతోనే శుక్రవారం ఇంట్లోని తన గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు అత్తాపూర్ పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు
Read Latest Telangana News And Telugu News