Share News

ఆహార కల్తీ నియంత్రణపై పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం

ABN , Publish Date - Mar 19 , 2026 | 09:06 PM

హైదరాబాద్‌లో ఆహార కల్తీ సమస్యను అరికట్టేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘H-FAST’ అనే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

ఆహార కల్తీ నియంత్రణపై పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం
Hyderabad Food Adulteration Control

హైదరాబాద్‌: ఆహార కల్తీ సమస్యలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌‌కు ‘H-FAST’ (Hyderabad Food Adulteration Surveillance Team) అని పేరుపెట్టారు. ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లో మొత్తం 28 మంది సభ్యులు ఉన్నారు. ఆహార కల్తీపై నిఘా పెట్టడం, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడం ఈ టీమ్ ప్రధాన బాధ్యతలు. ‘H-FAST’ టీమ్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుంది. రెస్టారెంట్లు, హోటళ్లు, ఆహార తయారీ కేంద్రాలను క్షుణ్నంగా పరిశీలించనున్నారు.


ఫిర్యాదులకు సోషల్ మీడియా సపోర్ట్

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ఈ టీమ్ సోషల్ మీడియాను కూడా వినియోగించనుంది. ఆహార కల్తీపై ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే, నేరుగా సంప్రదించడానికి ప్రత్యేక ఫోన్ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల కోసం ఈ నంబర్ సంప్రదించవచ్చు: 87126 61212. హైదరాబాద్‌లో ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకునేందుకు ‘H-FAST’ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్య రక్షణకు పెద్ద ముందడుగు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నిన్ను చంపేస్తాం.. రాజాసింగ్‌కు ఆగంతకుల బెదిరింపు..

హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...

Read Latest Telangana News

Updated Date - Mar 19 , 2026 | 09:14 PM