అధికారుల కీలక సమావేశం.. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు అనుమతులపై చర్చ..
ABN , Publish Date - Aug 18 , 2026 | 08:55 PM
హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన ఎన్‌సీఓలను త్వరగా జారీ చేయాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సంబంధిత అధికారులను కోరారు.
ఇంటర్‌నెట్ డెస్క్: హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన ఎన్‌సీఓలను త్వరగా జారీ చేయాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సంబంధిత అధికారులను కోరారు. ఈ మేరకు సచివాలయంలో కేంద్ర, రాష్ట్ర శాఖల అధికారులతో జయేష్ రంజన్ సమన్వయ సమావేశం నిర్వహించారు. జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హెచ్ఎమ్ఆర్ఎల్ ఎండీ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
కేంద్ర అనుమతుల కోసం డీపీఐఐటీ నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ ప్రక్రియలో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. ఫేజ్–2లో భాగంగా 7 కారిడార్ల ద్వారా మొత్తం 122.9 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన భూసేకరణ, రైల్వే క్రాసింగ్‌లు, మూసీ నది దాటే ప్రాంతాలు, గ్యాస్ పైప్‌లైన్లు, విమానాశ్రయ పరిధిలో నిర్మాణ అనుమతులపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రతిపాదిత కారిడార్లకు అన్ని శాఖలు త్వరితగతిన ఎన్‌సీఓలు జారీ చేయాలని సర్ఫరాజ్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. ఫేజ్–2 పనులు ముందుకు సాగితే హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత విస్తరించి, నగరంలో ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది.
ఇవి చదవండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో 2024 ఫలితాలే రిపీట్ అవుతాయి: బీజేపీ ఎమ్మెల్యే
హాకీ ప్రపంచ కప్: దక్షిణాఫ్రికాపై భారీ విజయం.. చరిత్ర సృష్టించిన భారత్