Share News

హైదరాబాద్ ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆస్పత్రిలో సైకో హల్‌చల్

ABN , Publish Date - May 19 , 2026 | 08:43 PM

హైదరాబాద్‌ ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నేడు (మంగళవారం) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తి ఒక్కసారిగా సైకోలా ప్రవర్తించాడు. ఆస్పత్రి ప్రాంగణంలో సర్జికల్ కత్తితో హల్‌చల్ చేస్తూ భయాందోళనలు సృష్టించాడు.

హైదరాబాద్ ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆస్పత్రిలో సైకో హల్‌చల్
Hyderabad Ghatkesar Hospital

హైదరాబాద్‌: ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నేడు (మంగళవారం) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తి ఒక్కసారిగా సైకోలా ప్రవర్తించాడు. ఆస్పత్రి ప్రాంగణంలో సర్జికల్ కత్తితో హల్‌చల్ చేస్తూ భయాందోళనలు సృష్టించాడు. అతడి దాడిలో ఇద్దరికి గాయాలు కావడంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు పరుగులు తీశారు.


ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి ఈ రోజు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. మొదట సాధారణ రోగిలా కనిపించిన అతడు కొద్దిసేపటికే ఆగ్రహానికి లోనయ్యాడు. తనకు వెంటనే చికిత్స చేయాలంటూ ఆస్పత్రి సిబ్బందిపై కేకలు వేయడం ప్రారంభించాడు. అనంతరం అక్కడే ఉన్న సర్జికల్ కత్తి తీసుకుని వైద్యులు, సిబ్బందిపై బెదిరింపులకు దిగాడు. కత్తితో దాడి చేసేందుకు యత్నించడంతో సిబ్బంది, రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరిపై సైకో కత్తితో దాడి చేయగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆస్పత్రి ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది.


స్థానికులు అప్రమత్తమై సైకోను ఎట్టకేలకు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఘట్‌కేసర్ పోలీసులు సైకోను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గాయపడిన వారికి ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి మానసిక పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 సమీక్షా సమావేశం.. హాజరైన భట్టి విక్రమార్క..

పోలీస్ వ్యవస్థను మరింత ఆధునికీకరిస్తాం: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Updated Date - May 19 , 2026 | 08:45 PM