స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 సమీక్షా సమావేశం.. హాజరైన భట్టి విక్రమార్క..
ABN , Publish Date - May 19 , 2026 | 07:29 PM
దేశ రాజధానిలో 'స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0' జాతీయ సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఢిల్లీ: దేశ రాజధానిలో 'స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0' జాతీయ సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా పట్టణ పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు దేశంలోని పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాల శాస్త్రీయ ప్రాసెసింగ్ అంశాలపై చర్చించారు.
అలాగే పాత చెత్త కుప్పల తొలగింపు, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, పీపీపీ విధానాలు, కొత్త ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల అమలు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్రాలు, నగరాలు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు, అనుభవాలు పరస్పరం పంచుకోవడంపైనా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశంలో తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
తెలంగాణలో అమలవుతున్న శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణాభివృద్ధి, సర్క్యులర్ ఎకానమీ దిశగా చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా భట్టి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రకటించిన తెలంగాణ విజన్-2047 లక్ష్యాల గురించీ వివరించారు. దానికి అనుగుణంగా రాష్ట్రాన్ని భవిష్యత్ అవసరాలకు సరిపోయే విధంగా, సుస్థిరంగా, సమగ్రంగా, పర్యావరణహితంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం CURE, PURE, RARE అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ఇందులో కోర్ అర్బన్ రీజియన్, పెరి-అర్బన్ రీజియన్, రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ల సమతుల్య అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం
రేవంత్ సర్కార్ కొత్త ఆలోచన.. యాదాద్రిలో తెలంగాణ కేబినెట్ భేటీ..