Share News

సైబర్‌ నారి వలపు వల 14.6 కోట్లకు టోకరా!

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:25 AM

ఫేస్‌బుక్‌లో పరిచయమైన గుర్తు తెలియని మహిళ మాయ మాటలు నమ్మిన ఓ వైద్యుడు ఏకంగా రూ.14.61కోట్లు పోగొట్టుకున్నాడు. ఆ మహిళ చాటింగ్‌లో విసిరిన వలపు వలలో పడిన ఆ వైద్యుడు.. ఆమె సూచించిన నకిలీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో రూ.కోట్లు డిపాజిట్‌ చేసి మొత్తానికి మోసపోయాడు.

సైబర్‌ నారి వలపు వల 14.6 కోట్లకు టోకరా!
Hyderabad doctor cyber scam

  • హైదరాబాద్‌ వైద్యుడి లబోదిబో

  • పెట్టుబడి పేరిట కిలాడీ లేడి మాయ మాటలు

  • ఫేస్‌బుక్‌ నుంచి టెలిగ్రామ్‌లోకి పిలిచి చాటింగ్‌

  • నమ్మిన వైద్యుడు.. నకిలీ యాప్‌లో ట్రేడింగ్‌

  • విత్‌డ్రా సమయంలో బయటపడ్డ మోసం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఫేస్‌బుక్‌లో పరిచయమైన గుర్తు తెలియని మహిళ మాయ మాటలు నమ్మిన ఓ వైద్యుడు ఏకంగా రూ.14.61కోట్లు పోగొట్టుకున్నాడు. ఆ మహిళ చాటింగ్‌లో విసిరిన వలపు వలలో పడిన ఆ వైద్యుడు.. ఆమె సూచించిన నకిలీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో రూ.కోట్లు డిపాజిట్‌ చేసి మొత్తానికి మోసపోయాడు. నెల రోజుల వ్యవధిలోనే ఆ మహిళ సదరు వైద్యుడిని బురిడీ కొట్టించగా.. సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యక్తి వద్ద కొల్లగొట్టిన పెద్ద మొత్తం ఇదే కావడం గమనార్హం. బాధిత వైద్యుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ సైబర్‌ మోసం బయటకొచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


హైదరాబాద్‌, ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఓ దంత వైద్యుడి(44)కి ఈ ఏడాది ఆగస్టు 27న ఫేస్‌బుక్‌లో ఓ మహిళతో పరిచయమైంది. చెన్నైకి చెందిన తన పేరు మోనికా మాధవ్‌ అని మాటలు కలిపిన ఆమె.. మరింత పరిచయం పెంచుకునేందుకు టెలిగ్రామ్‌కు ఆహ్వానించింది. టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ.. తనకు గతంలోనే పెళ్లయిందని విడాకుల కోసం ప్రయత్నిస్తున్నానని త్వరలోనే మంజూరు అవుతాయని చెప్పి వైద్యుడికి వలపు వల విసిరింది. ప్రస్తుతం తానో ట్రేడర్‌నని, రోజుకు రూ.4 లక్షల నుంచి రూ.5లక్షల వరకు సంపాదిస్తున్నానని చెప్పింది.


తనతో కలిసి ట్రేడింగ్‌ చేస్తే చాలా లాభాలు చూపిస్తానని ఆశ పెట్టింది. మోనిక మాయమాటలు నమ్మిన వైద్యుడు ఆమె ప్రతిపాదనకు అంగీకరించాడు. దీంతో సెప్టెంబరు 3న ఆమె చెప్పిన ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో రూ.30లక్షలు పెట్టుబడి పెట్టగా.. రూ.8.6 లక్షలు లాభం వచ్చినట్టు చూపింది. దాంట్లో నుంచి వైద్యుడు రూ.85,000 విత్‌ డ్రా చేసుకున్నాడు. దీంతో మోనికను వైద్యుడు మరింత నమ్మాడు. అనంతరం ఇద్దరం కలిసి రూ.10 కోట్లు పెట్టుబడిగా పెడదామని ప్రతిపాదన పెడితే వైద్యుడు దానికి సిద్ధమయ్యాడు.


తన వద్ద ఉన్న డబ్బుతోపాటు అప్పులు చేసి మరీ విడతల వారీగా రూ.14.51 కోట్లు ఆ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో డిపాజిట్‌ చేశాడు. మొత్తం రూ.34 కోట్లు లాభం వచ్చినట్టు ఆ సైట్‌ చూపెట్టింది. వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా.. విత్‌డ్రా ఆప్షన్‌ క్లోజ్‌ చేశారు. ఇదేమని అడిగితే మోనికా కూడా మాయమైంది. కాంటాక్ట్‌లను బ్లాక్‌ చేసేసింది. ఆపై, ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లోని కస్టమర్‌ కేర్‌ను వైద్యుడు సంప్రదించగా... రూ.7.5 కోట్లు పన్ను చెల్లిస్తేనే నగదు విత్‌ డ్రా అవుతుందని బదులు వచ్చింది. దీంతో మోసపోయానని ఆలస్యంగా అర్థం చేసుకున్న వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బాబోయ్‌ సుస్తీ

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ పోలీస్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 04:25 AM