పార్టీ మార్పుపై వివాదం.. హైకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం
ABN , Publish Date - Mar 26 , 2026 | 08:35 PM
పార్టీ మారలేదని చెబుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌ల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్‌కు నోటీసులు జారీ చేయగా, తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేశారు.
హైదరాబాద్: పార్టీ మారలేదని పేర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల కడియం శ్రీహరి, సంజయ్ పార్టీ మారలేదని అసెంబ్లీ స్పీకర్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కెపి వివేకానంద స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి, సంజయ్‌లకు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారగా, కోర్టు విచారణపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
క్షతగాత్రుల వివరాలు విడుదల.. మార్కాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సీతారాముల వారికి పటు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్: మంత్రి తుమ్మల
For More TG News