హీరోగా పరిచయం చేస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం?..
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:42 PM
ప్రముఖ సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువకుడిని సినిమా హీరోగా పరిచయం చేస్తానని నమ్మించి రూ.3.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువకుడిని సినిమా హీరోగా పరిచయం చేస్తానని నమ్మించి రూ.3.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. బాధిత యువకుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈఓడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు నిర్మాత విజయలక్ష్మి, దర్శకుడు అశోక్ బాబులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
తన కుమారుడిని సినీ హీరోగా పరిచయం చేస్తానని దర్శకుడు అశోక్ బాబు హామీ ఇచ్చారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివిధ దశల్లో రూ.3.5 కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే చెప్పిన విధంగా కుమారుడిని హీరోగా పరిచయం చేయకపోగా, తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈఓడబ్ల్యూ పోలీసులు అశోక్ బాబుపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంలో నిర్మాత విజయలక్ష్మి పాత్రా ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ మేరకు నేడు దర్శకుడు అశోక్ బాబుతో పాటు ఆమెనూ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గుడ్లూరి అశోక్ బాబు గతంలో పలు తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. భాగమతి, పిల్ల జమిందార్, ఆకాశరామన్న వంటి చిత్రాలతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ నేతలకు కంటి పరీక్షలు చేయించాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం..