మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:59 AM
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం చాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు.
యువతకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపు
ఏఐని సరైన రీతిలో వినియోగించుకోవాలి : కృష్ణ ఎల్లా
ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబరు8 (ఆంధ్రజ్యోతి): యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం చాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. యువత ఉద్యోగాలు చేసే వారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్షా అధ్యక్షతన ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో 640 మంది పీహెచ్‌డీ పట్టాలు, 71 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ... ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలను యువత మరింత సృజనాత్మకంగా, ఉత్పాదకంగా వినియోగించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ సస్పెన్షన్
‘సర్’ ప్రక్రియలో తెలంగాణలో కోటి ఓట్లను తీసేసే కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డి