రూ.1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం..
ABN , Publish Date - Jun 08 , 2026 | 07:45 PM
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) పరిధిలో రూ.1,674.74కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మియాపూర్‌లో రూ.161కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) ప్రధాన కార్యాలయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) పరిధిలో రూ.1,674.74కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మియాపూర్‌లో రూ.161కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) ప్రధాన కార్యాలయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రూ.530కోట్లతో మియాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అలాగే రూ.308కోట్లతో శేరిలింగంపల్లి ఆర్వోబీ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టారు. రూ.65.53కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్‌కు సీఎం రేవంత్ ప్రారంభోత్సవం చేశారు.
రూ.229 కోట్లతో ఓఆర్ఆర్‌కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన నిర్మాణం, ఓఆర్ఆర్ నుంచి కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. రూ.110కోట్లతో శంకర్‌పల్లి రోడ్ MGIT నుంచి మణికొండ వరకు పైప్ లైన్ రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. రూ.29.25కోట్లతో కొల్లూరు ఇంటర్‌చేంజ్ సమీపంలోని రెండు రైల్వే ఓవర్ హెడ్స్(RoBs) వరకు నాలుగు లేన్ల అప్రోచ్ ర్యాంపుల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. రూ.26.50కోట్లతో నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్ ఎడమ వైపు ఉన్న ప్రధాన క్యారేజ్ వే విస్తరణకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికీ భూమిపూజ చేశారు.
రూ.14.40కోట్లతో మాదాపూర్, నానక్‌రామ్‌గూడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణానికి సీఎం రేవంత్ కొబ్బరికాయ కొట్టారు. అనంతరం మియాపూర్‌లో 'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక' బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సభకు మంత్రి శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ఎమెల్యేలు అరికెపూడి గాంధీ, మాల్ రెడ్డి రంగారెడ్డి, నవీన్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
వివేకా కేసులో మరో కీలక మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ సునీతారెడ్డి పిటిషన్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి