చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఖాళీ బోగీలో అగ్నిప్రమాదం..
ABN , Publish Date - Nov 16 , 2026 | 08:13 PM
మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిపి ఉంచిన ఖాళీ బోగీలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన స్టేషన్ అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సికింద్రాబాద్, నవంబర్16: మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిపి ఉంచిన ఖాళీ బోగీలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన స్టేషన్ అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని వారు బోగీలో చెలరేగిన మంటలను ఆర్పేశారు. బోగీలు ఖాళీగా ఉండటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్పందించిన రైల్వే అధికారులు..
ఈ ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. సోమవారం సాయంత్రం 6:30 గంటలకు ఖాళీ కోచ్‌లో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. స్టేషన్‌లో 5, 6 ప్లాట్ పారమ్ మధ్య నిలిపి ఉన్న రైలులో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ మంటలను రాత్రి 7.15 గంటలకు ఆర్పేసినట్లు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉదయం నడక, సాయంత్రం నడక.. వీటిలో ఏది ఆరోగ్యానికి మేలు..?
జీవితంలో ఎదగాలంటే..? నాలుగు సింపుల్ సూపర్ టిప్స్..