Share News

నేడు సుప్రీంకోర్టులో 'ఓటుకు నోటు' కేసు విచారణ

ABN , Publish Date - Apr 22 , 2026 | 10:36 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసులో నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. వివరాల్లోకి వెళితే..

నేడు సుప్రీంకోర్టులో 'ఓటుకు నోటు' కేసు విచారణ
Cash for Vote Case

హైదరాబాద్, ఏప్రిల్ 22: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసులో నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.


ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద విచారించడం సరికాదని, కేవలం ఎన్నికల చట్టాల నియమావళి కింద మాత్రమే పరిగణించాలని కోరుతూ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చట్టపరమైన సాంకేతిక అంశాలను ఆయన తన పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించారు. మరోవైపు ఈ కేసుతో తనకు సంబంధం లేదని, నిందితుల జాబితా నుంచి తన పేరును పూర్తిగా తొలగించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోర్టును ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన ఈ రెండు పిటిషన్లలోని అంశాలు ఒకే కేసుకు సంబంధించినవి కావడంతో, ధర్మాసనం వీటిని కలిపి విచారించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..

11 గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్

Updated Date - Apr 22 , 2026 | 11:38 AM