అనని మాటలను కూడా నాపై ఆపాదిస్తున్నారు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు
ABN , Publish Date - Sep 07 , 2026 | 08:19 PM
అసెంబ్లీ బయట ఈరోజు జరిగిన ఘటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వివరణ ఇచ్చారు. తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వివరణ ఇచ్చారు. అసెంబ్లీ బయట తాను అనని మాటలను కూడా అన్నట్లుగా తనకు ఆపాదిస్తున్నారని అన్నారు. స్పీకర్ వ్యవస్థ పట్ల, అలాగే వ్యక్తిగతంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని తాతా మధు తెలిపారు.
ఒకవేళ తన వ్యాఖ్యల్లో ఏవైనా మాటలు స్పీకర్‌ను ఉద్దేశించినట్లుగా భావిస్తే.. ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో తన వైఖరిని స్పష్టం చేయడానికే ఈ వివరణ ఇస్తున్నట్లు తాతా మధు తెలిపారు.
Also Read:
ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం
మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్