తెలంగాణ హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
ABN , Publish Date - Mar 03 , 2026 | 01:15 PM
తెలంగాణ హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు ప్రాంగణంలో హైఅలర్ట్ ప్రకటించారు. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి బాంబు బెదిరింపు రావడం ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రోటోకాల్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు పరిసరాలను ఖాళీ చేయించి తనిఖీలు ప్రారంభించారు. బాంబు స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు రంగంలోకి దిగి ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి.
వారం రోజుల వ్యవధిలో రెండోసారి బాంబు బెదిరింపు రావడం గమనార్హం. ఇటీవల కూడా ఇలాంటి ఈ-మెయిల్ రావడంతో భద్రతా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ కోర్టులను లక్ష్యంగా చేసుకుని తమిళనాడు పేరుతో ఈ-మెయిల్ పంపినట్లు సమాచారం.
ఈ -మెయిల్ మూలాన్ని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం హైకోర్టు ప్రాంగణంలో భద్రతను మరింత పెంచి, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News