విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ నాశనం చేస్తున్నారు: ఎంపీ అర్వింద్
ABN , Publish Date - Aug 04 , 2026 | 04:12 PM
ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం సరైనది కాదని అరవింద్ అన్నారు. విద్యాశాఖ బాధ్యతలను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అరవింద్ సవాల్ విసిరారు. ఎవరి సహకారం లేకుండా రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు నింపగలరా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేవని అరవింద్ ఆరోపించారు. కొన్ని పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు, విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం ఒక్క ప్రభుత్వ పాఠశాలను అయినా సందర్శించారా అని ప్రశ్నించారు. ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేయకుండా కొత్త పాఠశాలల నిర్మాణం పేరుతో ప్రభుత్వం కమిషన్ల కోసం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు.
Also Read:
మంత్రి నారాయణను సన్మానించిన క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు
‘జగన్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వండి’.. తాడేపల్లిలో బోరుగడ్డ అనిల్ నిరసన