Share News

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు

ABN , Publish Date - Jun 22 , 2026 | 08:58 PM

హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు
Basavatarakam Cancer Hospital

హైదరాబాద్‌: నోవాటెల్ హోటల్‌లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు- పురందేశ్వరి దంపతులు, కేంద్ర మంత్రులు అనుప్రియ పటేల్, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రి సత్యకుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ, సినీనటి గౌతమి తదితరులు పాల్గొన్నారు.


అలాగే నందమూరి, నారా కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో వేడుకలకు హాజరయ్యారు. గత 25 ఏళ్లుగా క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. రజతోత్సవ వేడుకల సందర్భంగా ఆస్పత్రి ప్రస్థానం, వైద్య సేవలు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. క్యాన్సర్ చికిత్స రంగంలో ఆస్పత్రి అందిస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అతిథులు అభినందించారు.


Also Read:

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: నారా లోకేశ్

రైతులను ఇబ్బంది పెడితే క్రిమినల్ కేసులు.. డీలర్లకు మంత్రి అచ్చెన్న వార్నింగ్

Updated Date - Jun 22 , 2026 | 09:20 PM