లేని భూమితో బ్యాంకు రుణాలు రూ.4.11 కోట్లు కొట్టేసి రియల్ వ్యాపారం
ABN , Publish Date - Sep 03 , 2026 | 06:00 AM
లేని భూమిని కాగితాల్లో సృష్టించిన రియల్ ముఠా డబ్బుతో అధికారులను ఏమార్చి.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి.. వాటిని బ్యాంకుల్లో తనాఖా పెట్టి ఏకంగా రూ. 4.11 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం సబ్ రిజిస్ట్రార్‌ను సైతం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
లేని భూమితో బ్యాంకు రుణాలు రూ.4.11 కోట్లు కొట్టేసి రియల్ వ్యాపారం
నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
చంపాపేట సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్
అంతకుముందే ఏడుగురి అరెస్టు
నిందితులకు సహకరించిన నలుగురు
ఎస్సైలకు మెమోలు, ఒక ఎస్సై సస్పెన్షన్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): లేని భూమిని కాగితాల్లో సృష్టించిన రియల్ ముఠా డబ్బుతో అధికారులను ఏమార్చి.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి.. వాటిని బ్యాంకుల్లో తనాఖా పెట్టి ఏకంగా రూ. 4.11 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం సబ్ రిజిస్ట్రార్‌ను సైతం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదు అందినా పట్టించుకోకుండా నిందితులకు సహకరించిన పోలీసులపైనా చర్యలు చేపట్టారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర సీఐ అంజనేయులతో కలిసి మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు... ప్రస్తుతం చంపాపేట ఎస్‌ఆర్‌వోగా ఉన్న మహ్మద్ యూసఫ్ రహమాన్ గతంలో కీసరలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఆ సమయంలో కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆయన్ను సంప్రదించారు. కేవలం కాగితాల్లోనే భూమిని సృష్టించి, వాటిని నిజమైన వ్యక్తులకు సంబంఽధించిన భూమి పత్రాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకుగాను సబ్ రిజిస్ట్రార్‌కు రూ. 5లక్షలు ముట్టజెప్పారు.
తాను మంచివాడినని నిరూపించుకోవడానికి జరిగిన మోసంపై గతేడాది డిసెంబర్‌లో కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేవలం కంప్లైంట్ రావడమే తప్ప.. ఈఎంఐల విషయంలో గానీ, ఆర్థిక లావాదేవీల గురించి గానీ, బ్యాంకు అధికారుల నుంచి కూడా సమస్యలు లేకపోవడంతో.. అప్పట్లో కొంతమంది పోలీసులు ఈ ముఠాకు సహకరించారు. కాగా ఇటీవల కీసర పోలీస్ స్టేషన్‌లో కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఇటీవల బాధ్యతలు చేపట్టిన అధికారులు పరిశీలించారు. దర్యాప్తు పూర్తికాకుండానే పక్కనపడేసిన కేసుల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాటి దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగు చూడడంతో అరెస్టుల పర్వం మొదలైంది. ఈ కేసును మురగబెట్టిన నలుగురు ఎస్సైలకు చార్జి మెమోలు ఇవ్వడంతోపాటు.. ఒక ఎస్సైని సస్పెండ్ చేసినట్లు డీసీపీ తెలిపారు. ఇంకా మరి కొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను వివిధ బ్యాంకుల్లో తనాఖా పెట్టి గృహరుణాల పేరుతో అక్కడి సిబ్బందిని మచ్చిక చేసుకొని మొత్తం రూ.4.11 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఈ డబ్బులో కొంతమేరకు ఈఎంఐలు చెల్లించడానికి తీసి.. మిగిలిన డబ్బుతో వేరే ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆ భూమిని లాభాలకు అమ్మేసి వచ్చిన డబ్బును మరో చోట పెట్టుబడి పెడుతున్నారు. ఇలా కేవలం కాగితాల్లోనే సృష్టించిన భూమితో అడ్డదారిలో సులభంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముఠాలోని ఓ వ్యక్తి ఏదో ఒక రోజు ఈ మోసం బయటపడుతుందని అనుమానించాడు.
ఇవి కూడా చదవండి
రైల్వే సీట్లు బ్లూ కలర్‌లోనే ఎందుకు ఉంటాయి? ఆసక్తికర విషయాలివే.!