ఫామ్‌ఎస్ కు కాంగ్రెస్ నేతలు.. పెద్ద జోక్
ABN , Publish Date - Sep 21 , 2026 | 07:14 AM
కేసీఆర్ ఫాంహౌస్ సందర్శనపై బండి సంజయ్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఖైరతాబాద్ ఉపఎన్నిక, 22ఏ భూముల సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు.
ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం వారికెక్కడిది
కాంగ్రెస్‌కు ఉప ఎన్నికను ఎదుర్కొనే ధైర్యం లేదు: బండి సంజయ్
కరీంనగర్, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘కాంగ్రెస్ నేతల ఫాంహౌస్ సందర్శన పెద్ద జోక్. కేసీఆర్ ఫాంహౌస్ ఏమైనా టూరిజం కేంద్రమా? ప్రైవేట్ భూములను సందర్శించడానికి వారికి అధికారం ఎక్కడిది?’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. అధికారం మీ చేతుల్లోనే ఉందని, ఫాంహౌ్‌సలో ప్రభుత్వ భూములు ఉంటే అధికారులను పంపించి స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సూచించారు. అంతేకాకుండా వాటికి సంబంధించిన ఆధారాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఫాంహౌస్ భూములను సందర్శిస్తే అర్థం చేసుకోవచ్చు కానీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సందర్శించడం అర్థరహితమన్నారు.
22ఏ (నిషేధిత భూముల జాబితా)తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు 22ఏను తమకు అనుకూలంగా వాడుకున్నారని విమర్శించారు. ఈ సమస్యపై తదుపరి కార్యాచరణ చేపడతామని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్లిందని విమర్శించారు. ఉపఎన్నికలో పోటీ బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్యే ఉంటుందన్నారు. దానం నాగేందర్ తనను తాను ఖైరతాబాద్ వినాయకుడితో పోల్చుకోవడం ఆశ్చర్యంగా ఉందని, వినాయకుడిని ఉత్సవాల తర్వాత నిమజ్జనం చేస్తారనే విషయాన్ని నాగేందర్ గుర్తుంచుకొని జాగ్రత్తపడితే మంచిదని సూచించారు. నాగేందర్ నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక జరిగితే కాంగ్రె్‌సను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమన్నారు.
వార్తలనూ చదవండి:
బీసీల కోసం దేశవ్యాప్త ఐక్య పోరాటం
సీఎం సన్నిహితుడు గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు!
Read Latest Telangana News And Telugu News