రోడ్డు భద్రతలో ఏఐ వినియోగంపై పరిమితులున్నాయి
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:26 AM
రోడ్డు భద్రత, నిర్వహణలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై పరిమితులు ఉన్నాయని ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో జరిగిన ఓ కార్యక్రమంలో నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో నిపుణులు
హైదరాబాద్ సిటీ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రత, నిర్వహణలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై పరిమితులు ఉన్నాయని ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో జరిగిన ఓ కార్యక్రమంలో నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘రోడ్డు భద్రతలో ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులు, వాటి పరిమితులు’ అనే అంశంపై నిపుణులు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. రోడ్ల నిర్వహణలో ఏఐ వినియోగించి చేసే పరిశీలనలతో పోలిస్తే సాధారణంగా క్షేత్రస్థాయిలో చేసే పరిశీలనల్లో కచ్చితత్వం ఎక్కువగా ఉండటంతో పాటు ఖర్చు తక్కువగా ఉంటుందని తెలిపారు.
ఏఐ వినియోగించి జియోట్యాగింగ్ ద్వారా చేసే పరిశీలనల్లో రోడ్డుపై ఉన్న గుంతల లెక్క సులభంగా తేలినప్పటికీ వాటి లోతు గురించి స్పష్టత ఉండదన్నారు. ఏఐ ద్వారా రోడ్డు పరిస్థితిని అంచనా వేసినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటిని సరిచేసేందుకు మానవ ప్రమేయం కచ్చితంగా ఉంటుందని నిపుణులు వెల్లడించారు. ఏఐ వినియోగించి బెంగళూరులో చేసిన రహదారి సర్వేను వారు ఉదాహరణగా చూపారు.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక