Share News

హైదరాబాద్‌లో విషాదం.. అదనపు కట్నం వేధింపులతో వివాహిత మృతి

ABN , Publish Date - Oct 01 , 2026 | 08:52 AM

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక కవిత అనే వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త, అత్తింటి వేధింపులే తన కుమార్తె మృతికి కారణమని కవిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో విషాదం.. అదనపు కట్నం వేధింపులతో వివాహిత మృతి
Hyderabad

హైదరాబాద్‌, అక్టోబర్ 1: యూసుఫ్‌గూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక కవిత అనే వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. గజ్వేల్‌కు చెందిన పి.కవితకు 2014లో యూసుఫ్‌గూడకు చెందిన శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కవిత కుటుంబ సభ్యులు రూ.20 లక్షల కట్నం ఇచ్చినట్లు సమాచారం. అయితే పెళ్లైన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం భర్త శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులు కవితను వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 2019లో గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదిరినా వేధింపులు కొనసాగినట్లు తెలుస్తోంది.


ఇటీవల సెప్టెంబర్‌ 25న శ్రీనివాస్ కవితపై దాడి చేసినట్లు.. సర్దిచెప్పేందుకు వచ్చిన ఆమె తండ్రి బాలచంద్రం ఎదుటే చంపేస్తానంటూ బెదిరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త వేధింపులు తట్టుకోలేక సెప్టెంబర్‌ 29న కవిత కెమికల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కమలాపురి కాలనీలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించగా.. రెండు రోజుల పాటు చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎస్‌ఏ పరీక్షల మూల్యాంకనం వేరే పాఠశాలల్లో..

ఎల్‌నినో.. దిగుబడి ఏమవునో?

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 01 , 2026 | 11:17 AM