Share News

రైతుల నుంచి పాలు కొనడంలో హైదరాబాదీలు టాప్‌!

ABN , Publish Date - Nov 27 , 2026 | 04:56 AM

‘‘అమ్మా పాలు..’’ ఇళ్ల వద్దకు వచ్చి పాలు పోసే పాడి రైతులు పిలిచే పిలుపు అది.

రైతుల నుంచి పాలు కొనడంలో హైదరాబాదీలు టాప్‌!
milk

  • నగరవాసుల్లో 38 శాతం మంది కొనుగోళ్లు వారి వద్దే

  • టీ, కాఫీల రూపంలో రోజూ పాలు తాగేవారు 55 శాతం మంది

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘అమ్మా పాలు..’’ ఇళ్ల వద్దకు వచ్చి పాలు పోసే పాడి రైతులు పిలిచే పిలుపు అది. పాల ప్యాకెట్ల వినియోగం పెరగడంతో ఈ పిలు పు ఇటీవల కొన్ని ఇళ్లకే పరిమితమైంది. కానీ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇలా ‘అమ్మా పాలు’ అనే మాట వింటున్న జనాభా భారీగానే ఉన్నారు. హైదరాబాద్‌ వాసుల్లో 38శాతంమంది ఇప్పటికీ పాడి రైతుల వద్దే పాలు కొనుగోలు చేస్తున్నారు. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఇది అత్యధికం. ఇక, వివిధ సబ్ స్క్రిప్షన్ యాప్‌ల ద్వారా 34శాతం మంది పాలు కొనుగోలు చేస్తున్నారు. జాతీయ పాల దినోత్సవం సందర్భంగా గోద్రెజ్‌ జెర్సీ సంస్థ విడుదల చేసిన ల్యాక్టోగ్రాఫ్‌-2026 నివేదిక ఈ ఆసక్తికర విషయా న్ని వెల్లడించింది. యూగోవ్‌ సంస్థ పాల వినియోగంపై దేశంలోని ఎనిమిది నగరాల్లో నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం.. హైదరాబాద్‌ వాసుల్లో టీ, కాఫీల రూపంలో ప్రతి రోజు పాలు సేవించే వారు 55 శాతం మంది ఉన్నా రు. పాలను రోజువారీ ప్రొటీన్‌ వనరుగా తీసుకుంటున్నవారు 61శాతం మంది ఉన్నారు. పాలలో శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయని 55శాతం మందికి అవగాహన ఉంది. ధిక ప్రొటీన్‌ పాలపై 35శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ 19శాతం మందే ఈ పాలను వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లో సంప్రదాయ పద్ధతిలో రైతుల వద్ద పాలు కొనుగోలు చేయడంతో పాటు సబ్‌స్ర్కిప్షన్‌ యాప్‌ల ద్వారా సౌకర్యవంతంగా పాలు పొందే విధానాలు సమాంతరంగా కొనసాగుతున్నాయని గోద్రెజ్‌ జెర్సీ సీఈఓ గౌరవ్‌ పాండే పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులు?

రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్

Updated Date - Nov 27 , 2026 | 05:27 AM