హైదరాబాద్-శ్రీనగర్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుల పడిగాపులు!
ABN , Publish Date - Jul 04 , 2026 | 07:05 PM
హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని చండీగఢ్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరిన ఈ ఇండిగో విమానంలో మొత్తం 231 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని చండీగఢ్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరిన ఈ ఇండిగో విమానంలో మొత్తం 231 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా హైదరాబాద్ నగరానికి చెందిన అమర్‌నాథ్ యాత్రికులు కావడం గమనార్హం. శ్రీనగర్‌లో ల్యాండింగ్ కావడానికి తీవ్ర సమస్యలు తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని చండీగఢ్ వైపు మళ్లించాల్సి వచ్చింది.
మొత్తానికి విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయినప్పటికీ, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. చండీగఢ్ విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా ఇండిగో యాజమాన్యం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని హైదరాబాద్‌కు చెందిన అమర్‌నాథ్ యాత్రికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ప్రత్యేక హెలికాప్టర్లు లేదా ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Also Read:
రెడీమేడ్ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ..ఒకే ట్రిప్‌లో 6 ప్రముఖ పుణ్యక్షేత్రాలు..