రెడీమేడ్ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
ABN , Publish Date - Jul 03 , 2026 | 02:42 PM
రోజూ అల్లం, వెల్లుల్లి శుభ్రం చేసి పేస్ట్ తయారు చేయడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ పేస్ట్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇంట్లోనే సులభంగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి, నిల్వ చేస్తే కొన్ని నెలల వరకు తాజాగా ఉంచుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వంటల్లో అల్లం-వెల్లుల్లి పేస్ట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి కూరలో ఇది ఉపయోగిస్తారు. రోజూ అల్లం, వెల్లుల్లి శుభ్రం చేసి పేస్ట్‌గా తయారు చేయడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే చాలామంది మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ పేస్ట్‌ను కొనుగోలు చేస్తారు. అయితే వాటిలో ప్రిజర్వేటివ్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లోనే పరిశుభ్రంగా తయారు చేసుకుంటే రుచి, నాణ్యత రెండూ మెరుగ్గా ఉంటాయి. సరైన పద్ధతిలో తయారు చేసి నిల్వ చేస్తే ఈ పేస్ట్‌ను కొన్ని నెలల వరకు తాజాగా ఉంచుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
వెల్లుల్లి – 1 కిలో
అల్లం – 400 నుంచి 500 గ్రాములు
వంట నూనె – అర కప్పు
తగినంత ఉప్పు
పేస్ట్ తయారుచేసే విధానం
ముందుగా వెల్లుల్లి రెబ్బలపై ఉన్న తొక్కలను పూర్తిగా తీసి, వాటిని శుభ్రమైన నీటితో కడిగి కాసేపు ఆరబెట్టాలి. అలాగే అల్లాన్ని కూడా బాగా కడిగి, పై తొక్కను తీసి చిన్న చిన్న ముక్కలుగా కోట్ చేసుకోవాలి.
మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి వేసి నీరు పోయకుండా అర కప్పు వంట నూనె, తగినంత ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. చాలామంది నీరు కలపడం వల్ల పేస్ట్ త్వరగా పాడవడం, రంగు మారడం జరుగుతుంది. అందుకే నీటికి బదులుగా నూనె ఉపయోగించడం మంచిది.
తయారైన పేస్ట్‌ను పొడిగా ఉన్న గాజు లేదా స్టీల్ గాలి చొరబడని సీసాలో నింపాలి. నీరు కలపకుండా, నూనెతో తయారు చేసిన ఈ పేస్ట్ సరైన నిల్వలో ఉంచితే దాదాపు కొన్ని నెలల వరకు తాజాగా ఉండే అవకాశం ఉంది.
పేస్ట్ తీసుకునే ప్రతిసారి శుభ్రమైన, పొడిగా ఉన్న చెంచాను మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్థాల నిల్వ కాలం పరిశుభ్రత, తేమ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాసన, రంగు లేదా రుచిలో మార్పు కనిపిస్తే వాడకపోవడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్