హైదరాబాద్‌లో రౌడీ షీటర్ అరెస్ట్.. దేశీయ పిస్టల్ స్వాధీనం
ABN , Publish Date - Sep 14 , 2026 | 08:50 PM
హైదరాబాద్‌లో పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ఓ రౌడీషీటర్ దేశీయ పిస్టల్‌తో పట్టుబడ్డాడు. గుడిమల్కాపూర్‌లో టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అబిద్ హుస్సేన్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పిస్టల్, 6 లైవ్ రౌండ్లు, మ్యాగజైన్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 14: నగరంలోని గుడిమల్కాపూర్‌లో కంట్రీ మేడ్ పిస్టల్‌తో తిరుగుతున్న రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనర్ టాస్క్‌ఫోర్స్ గోల్కొండ జోన్, గుడిమల్కాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సయ్యద్ అబిద్ హుస్సేన్ అలియాస్ అలీ భాయ్ అలియాస్ అలీ డాన్ (55)తో పాటు మహమ్మద్ అంజద్ (31)ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు సాహిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఒక దేశీయ పిస్టల్, మ్యాగజైన్, 6 లైవ్ రౌండ్లతో పాటు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అబిద్ హుస్సేన్‌పై గతంలో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, బెదిరింపులు, వసూళ్లు, ఆర్మ్స్ యాక్ట్ తదితర కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తులో అబిద్ హుస్సేన్‌కు జహీరాబాద్‌లో రౌడీషీట్ ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న సాహిల్ నుంచి రూ.45 వేలకుపైగా చెల్లించి పిస్టల్ కొనుగోలు చేసినట్లు.. అనంతరం దానిని అంజద్ వద్ద భద్రపరిచినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆర్మ్స్ యాక్ట్‌లోని సెక్షన్లు 25(1-B)(a), 29 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పట్టుబడిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇతర వస్తువులపై పోలీసులు మరింత విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
నల్లగొండలో కేటీఆర్ పాదయాత్ర చేస్తే.. నేనూ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి
బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And Telugu News