విద్యుత్ రంగంలో సరికొత్త టెక్నాలజీ.. నెక్లెస్ రోడ్‌లో పవర్ ఎగ్జిబిషన్ ప్రారంభం
ABN , Publish Date - Aug 22 , 2026 | 03:15 PM
హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో పవర్ ఎగ్జిబిషన్–2026 ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించగా.. మూడు రోజుల పాటు కొనసాగనున్న ప్రదర్శనలో విద్యుత్ రంగంలోని ఆధునిక సాంకేతికతలు, భద్రతా చర్యలు, పునరుత్పాదక ఇంధనం, స్మార్ట్ మీటరింగ్, ఈవీ ఛార్జింగ్ వ్యవస్థలను ప్రదర్శిస్తున్నారు..
హైదరాబాద్, ఆగస్టు 22: నగరంలోని నెక్లెస్ రోడ్‌లో పీపుల్స్ ప్లాజాలో పవర్ ఎగ్జిబిషన్–2026 ఘనంగా ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో విద్యుత్ రంగంలో అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికతలను ప్రదర్శిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగంలో చోటుచేసుకుంటున్న సాంకేతిక మార్పులను ప్రజలకు పరిచయం చేయడం ఈ ఎగ్జిబిషన్ ప్రధాన ఉద్దేశంగా ఉంది.
ఎగ్జిబిషన్‌లో విద్యుత్ భద్రతా చర్యలు, పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. స్మార్ట్ మీటరింగ్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఛార్జింగ్ వ్యవస్థలు వంటి నూతన సాంకేతికతలపై సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను ప్రజలు ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మనిషితో బాక్సింగ్ చేసిన చైనా రోబో.. కానీ ఆ చిన్న పని మాత్రం చేయలేకపోయింది..
మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..