Share News

10గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్..

ABN , Publish Date - Jan 22 , 2026 | 06:46 AM

నగరంలోని ఆయా ఏరియాల్లో గురువారం ఉదయం 10గంటల నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, ఇతర కారణాలతో సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

10గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్..

- నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

హైదరాబాద్: గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ(Greenlands ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ రాజీవ్‌ నగర్‌, బేగంపేట విద్యుత్‌ టవర్‌ ఫీడర్ల పరిధి, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11కేవీ అల్లావుద్దీన్‌ కోఠి ఫీడర్‌ పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ మూసాపేట్‌, దివ్య శక్తి అపార్ట్‌మెంట్‌, శ్రీనివాసనగర్‌ ఈస్ట్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


సైదాబాద్‌: టీజీఎస్పీడీసీఎల్‌ ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌ పరిధిలోని మరమ్మతు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉందని డీఈ తెలిపారు. 11కేవీ శాలివాహన నగర్‌ ఫీడర్‌ పరిధిలోని పరిసర ప్రాంతాలలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్గ్గా ఫీడర్‌ పరిధిలోని పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయత్రం 5 గంటల వరకు, జీఎం నగర్‌, జ్యోతిబాగ్‌ ఫీడర్ల పరిధిలోని పరిసర ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు.


ఉప్పల్‌: బోడుప్పల్‌ ఇంద్రానగర్‌ విద్యుత్‌ సబ్‌ ేస్టషన్‌ పరిధిలో వేసవి కార్యాచరణ ప్రణాళిక పనులు, చెట్ల కొమ్మల తొలగింపులో భాగంగా గురువారం విద్యుత్‌ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఏఈ ఎన్‌.వేణుగోపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ ఎస్‌బీఆర్‌ కాలనీ ఫీడర్‌లోని పద్మావతి కాలనీ, అమ్మ సాని వెంకట్‌ రెడ్డి కాలనీ, ఆర్‌ఎన్‌ఎస్‌ కాలనీ, ఎస్‌బీఆర్‌ కాలనీ, బీఎల్‌ నగర్‌, అంజయ్య ఎన్‌క్లేవ్‌, టెలిఫోన్‌ కాలనీ (ఫేజ్‌-11), పీఎన్‌ఆర్‌ కాలనీ, రెడ్డీస్‌ కాలనీ, భావాని నగర్‌, శుభోదయ కాలనీ, లెక్చరర్స్‌ కాలనీ, గ్రీన్‌ సిటీ కాలనీ, అనగాపురి కాలనీ, భీమ్‌రెడ్డి కాలనీ, ఎన్‌ఐఎన్‌ కాలనీలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 11 కేవీ సరస్వతి నగర్‌ ఫీడర్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు వివరించారు.


బోడుప్పల్‌లో..

బోడుప్పల్‌లోని సాయినగర్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సాయినగర్‌ (పరిధి), ఆర్‌ఎన్‌ఎస్‌ కాలనీ (పరిధి), కమలా నగర్‌, అమ్మసాని వెంకట్‌ రెడ్డి కాలనీ, పద్మావతి కాలనీల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్‌ఎన్‌ఎస్‌ కాలనీ ఫీడర్‌ పరిధి లో సాయినగర్‌ (పరిధి), ఆర్‌ఎన్‌ఎస్‌ రాయల్‌ మీడోస్‌, ఫేజ్‌-3, డ్రీమ్‌ హోమ్స్‌, అంజయ్య ఎన్‌క్లేవ్‌, టెలిఫోన్‌ కాలనీ, రాజలింగం కాలనీ, ఏఏఆర్‌ కాలనీ, సరఫరా నిలిపి వేయ నున్నట్లు చిలకానగర్‌ ఆపరేషన్‌ ఏఈ వినయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.


city1.2.jpg

ఓయూటీ కాలనీలో..

కాప్రా: చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా మాణిక్‌సాయి ఫీడర్‌ పరిధిలోని ఓయూటీ కాలనీ, మాణిక్‌ సాయి ఎన్‌క్లేవ్‌, మాధవపురి, భాస్కరరావునగర్‌, క్లాసిక్‌ ఎన్‌క్లేవ్‌, లేక్‌వ్యూ కాలనీ పరిసర ప్రాంతాలలో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, ఈశ్వరిపురి ఫీడర్‌ పరిధిలోని ఎస్‌బీవో కాలనీ తదితర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా ఉండదని సైనిక్‌పురి ఏఈ తెలిపారు.


చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా సబ్‌స్టేషన్‌ పరిధిలో డీటీఆర్‌ చార్జింగ్‌ పనుల వల్ల గురువారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ రాజేందర్‌ సింగ్‌ తెలిపారు. తానాజీనగర్‌ ఫీడర్‌ పరిధిలోని మధ్యాహ్నం 12నుంచి ఒంటి గంట వరకు అరుంధతి కాలనీ, తానాజీ నగర్‌, లలితాబాగ్‌, మారుతి నగర్‌, ముక్కర్‌ బస్తీ, భయ్యాలాల్‌నగర్‌, - పటేల్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలో మధ్యా హ్నం 2 నుంచి 3 గంటల వరకు పటేల్‌నగర్‌, లలితాబాగ్‌, అంబికానగర్‌, ఖాన్‌నగర్‌, - ఛత్రినాక ఫీడర్‌ పరిధిలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఛత్రినాక, బోయిగూడ, శ్రీరాంనగర్‌, మక్దూంపురా, గౌలిపురా, మురాద్‌ మహల్‌, బాలాగంజ్‌, లాల్‌దర్వాజ విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ తెలిపారు.


రాయదుర్గం: ఓల్డ్‌ గచ్చిబౌలి 11కేవీ విద్యుత్‌ పీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్న విద్యుత్‌ అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇందిరానగర్‌, ఓల్డ్‌గచ్చిబౌలి, సెంట్రల్‌మాల్‌ ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు. అదేవిధంగా ఉదయం 10 నుంచి 11గంటల వరకు జేవీకాలనీలో, మధ్యాహ్నం 3-4గంటల వరకు ఏపీహెచ్‌బీ కాలనీలో విద్యుత్‌ ఉండదని అధికారులు తెలిపారు.


చందానగర్‌లో..

చందానగర్‌: పాపిరెడ్డికాలనీ, ఆరంభ టౌన్‌ షిప్‌, రాజీవ్‌గృహకల్ప, దూబేకాలనీ ఫీడర్ల పరిధిలో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 11 నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని గచ్చిబౌలి డివిజన్‌ ఏడీఈ శివకృష్ణప్రసాద్‌ తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్‌

పాలిచ్చే పశువులకు చికెన్‌, మటన్‌ వ్యర్థాలు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 22 , 2026 | 06:50 AM