Share News

హైదరాబాద్‌లో భూగర్భ జలాలకు ఎల్‌నినో దెబ్బ.. హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 07 , 2026 | 11:52 AM

హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, రాబోయే రోజుల్లో నగరంలో నీటి సమస్య మరింత తీవ్రం కావచ్చని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.

హైదరాబాద్‌లో భూగర్భ జలాలకు ఎల్‌నినో దెబ్బ.. హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
Groundwater Depletion

హైదరాబాద్, నవంబర్ 7: నగరంలో భూగర్భ జలాల పరిస్థితిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో నగరంలో భూగర్భ జలాలు గణనీయంగా దెబ్బతిన్నాయని, రాబోయే రోజుల్లో నగరవాసులు నీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలో భూగర్భ జలాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో నగరవాసులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. నగరంలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల దందాపై హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించిందని వెల్లడించారు. చెరువుల పరిసరాల్లో కొంతమంది అక్రమంగా బోర్లు వేస్తూ నీటిని తోడుతున్నారని, ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు హైడ్రా ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటికే వందలాది కమర్షియల్ బోర్లతో పాటు భారీ మోటార్లను తొలగించినట్లు వివరించారు.


మరోవైపు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా హాస్టళ్ల నిర్వాహకులు నగరంలోని భూగర్భ జలాలపై మరింత ఒత్తిడి పెంచకుండా హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలని సూచించారు. నగరంలో నీటి పరిస్థితిపై జలమండలి అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. చెరువుల చుట్టుపక్కల అక్రమ బోర్లను గుర్తించి తొలగించడంతో పాటు నీటి వనరుల పరిరక్షణకు చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజలు, హాస్టళ్ల నిర్వాహకులు, వాటర్ ట్యాంకర్ల యజమానులు బాధ్యతగా వ్యవహరించాలని హైడ్రా కమిషనర్ సూచించారు.


ఇవీ చదవండి:

కర్ణాటకలో పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్‌

తరుణ్‌ తేజ్‌పాల్‌ శిక్ష నిలిపివేతకు సుప్రీం నో

Updated Date - Nov 07 , 2026 | 01:02 PM