హైదరాబాద్‌లో 6 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్ట్
ABN , Publish Date - Aug 17 , 2026 | 07:21 PM
హైదరాబాద్‌లో గంజాయి సరఫరా, విక్రయాలపై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది. పేట్ బషీర్‌బాద్ పోలీసులు, ఈగల్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఐదుగురు గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేశారు..
హైదరాబాద్, ఆగస్టు 17: కొంత కాలంగా నగరంలో గంజాయి సరఫరా, విక్రయాలపై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది. పేట్ బషీర్‌బాద్ పోలీసులు, ఈగల్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఐదుగురు గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేశారు. హమిద్, మొహమ్మద్ అబ్బాస్, మొహమ్మద్ ముస్తఫానా, ఇర్ఫాన్ ఖాన్, సయ్యద్ అఫ్రోజ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి ఓ ఆటో, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆటోలోని స్పీకర్ సౌండ్ బాక్స్‌లో అత్యంత చాకచక్యంగా దాచిన ఆరు కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
విచారణలో నిందితులు నాగ్‌పూర్‌కు వెళ్లి రూ.లక్షకు ఆరు కిలోల గంజాయిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నాగ్‌పూర్‌కు చెందిన షేక్ సాదిక్‌ను ప్రధాన సరఫరాదారుగా గుర్తించగా.. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్, నాంపల్లి దర్గా, పబ్లిక్ గార్డెన్స్ పరిసరాల్లో గంజాయి విక్రయాలు సాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హమిద్‌తో సంబంధం ఉన్న 25 మందికి పైగా వినియోగదారుల వివరాలపై పోలీసులు సేకరిస్తున్నారు. గతంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎక్స్‌టార్షన్, ఆర్మ్స్ యాక్ట్ కేసులో హమిద్ అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. పేట్ బషీర్‌బాద్ పోలీస్‌స్టేషన్‌లో NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి, గంజాయి సరఫరా, పంపిణీ నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
నేల తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్
ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..