Share News

నకిలీ పంచలోహ విగ్రహాలతో మోసం.. ఆరుగురి అరెస్ట్

ABN , Publish Date - Aug 16 , 2026 | 07:17 PM

పంచలోహ విగ్రహాలతో అదృష్టం కలిసొస్తుందంటూ అమాయకులను నమ్మించి భారీగా డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేసిన ముఠా పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే..

నకిలీ పంచలోహ విగ్రహాలతో మోసం.. ఆరుగురి అరెస్ట్
Hyderabad fake idol scam

హైదరాబాద్, ఆగస్టు 16: నగరంలో నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాలను చూపించి అమాయకులను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులతో కలిసి పట్టుకున్నారు. కాటేదాన్‌ లక్ష్మిగూడలో కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తుండగా ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. విగ్రహానికి దివ్యశక్తులు ఉన్నాయని, దానిని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం కలిసొస్తుందని నమ్మించి భారీ ధరకు విక్రయించేందుకు ముఠా ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అరుదైన గులాబీ రంగు రాయి పేరుతోనూ కొనుగోలుదారులను మోసం చేసేందుకు నిందితులు పథకం వేసినట్లు వెల్లడించారు.


2024లో ఈ ముఠా రూ.10 లక్షలకు నకిలీ పంచలోహ విగ్రహాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం దాన్ని మరింత భారీ ధరకు విక్రయించేందుకు జ్యోతిష్యుడితో కలిసి పక్కా స్కెచ్‌ వేసినట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో కార్‌ డ్రైవర్లు, కార్మికుడు, జ్యోతిష్యుడు ఉన్నారు. నిందితుల నుంచి నకిలీ లక్ష్మీదేవి విగ్రహం, పింక్‌ కలర్‌ రాయి, ఎర్టిగా కారు, ఐదు మొబైల్‌ ఫోన్లు, మూడు రసాయన ద్రావణాల బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..

ప్రాణాల్ని పణంగా పెట్టి.. గర్భిణిని ఆసుపత్రికి తరలింపు

Updated Date - Aug 16 , 2026 | 08:34 PM