Share News

హైదరాబాద్ భారీగా అల్ప్రాజోలం పట్టివేత.. ఐదుగురి అరెస్ట్

ABN , Publish Date - Sep 02 , 2026 | 07:27 AM

డ్రగ్స్ దందాకు అడ్డాగా మారుతున్న కొంపల్లిలో పోలీసులు మెరుపుదాడి చేశారు. జయభేరి పార్క్ వద్ద అల్ప్రాజోలం విక్రయిస్తున్న ముఠాను పక్కా సమాచారంతో పట్టుకున్న పెట్ బషీరాబాద్ పోలీసులు.. ఏకంగా 1.9 కేజీల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు..

హైదరాబాద్ భారీగా అల్ప్రాజోలం పట్టివేత.. ఐదుగురి అరెస్ట్
Hyderabad Drug Bust

హైదరాబాద్, సెప్టెంబర్ 2: నగరంలోని కుత్బుల్లాపూర్‌లోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాపై పోలీసులు దాడి చేసి భారీగా అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. కొంపల్లిలోని జయభేరి పార్క్ వద్ద అల్ప్రాజోలం విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 1.9 కేజీల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకోగా.. దాని విలువ సుమారు రూ.19 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అదేవిధంగా నిందితులు వినియోగిస్తున్న కారు, ఒక బైక్, రూ.40 వేల నగదు, ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. కామారెడ్డి నుంచి అల్ప్రాజోలం తీసుకువచ్చి కొంపల్లి ప్రాంతంలో విక్రయించేందుకు ముఠా ప్రయత్నిస్తోందన్న పక్కా సమాచారంతో పోలీసులు ముందస్తు నిఘా ఏర్పాటు చేసి దాడి చేసినట్లు తెలుస్తోంది.


జయభేరి పార్క్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న సమయంలో నిందితులను పట్టుకున్న పోలీసులు.. వారి వద్ద ఉన్న మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు. ఈ ఘటనతో కొంపల్లి, కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గొల్ల రమేష్ గతంలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. రమేష్‌పై గతంలోనే మూడు NDPS కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.7.4 కోట్ల నకిలీ నోట్లు!

Updated Date - Sep 02 , 2026 | 07:35 AM