జిమ్ ట్రైనర్ల వికృత చేష్టలు.. సనత్ నగర్ జిమ్ కేసులో విస్తుపోయే నిజాలు!
ABN , Publish Date - Jun 26 , 2026 | 07:51 PM
హైదరాబాద్‌లోని సనత్ నగర్ కల్ట్ జిమ్ వేధింపుల ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్, జూన్ 26: నగరంలోని సనత్ నగర్ కల్ట్ జిమ్ వేధింపుల ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఒక పైలట్‌ను వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మహిళ.. ఇప్పుడు అదే జిమ్‌లో తనను కొందరు తీవ్రంగా వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. జిమ్‌లో పరిచయమైన శ్రుతిక అనే మహిళ తనను అసభ్య కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తాను, తన ప్రియుడు నరేష్ నాయుడుతో పాటూ జిమ్ ట్రైనర్లుగా పనిచేస్తున్న చెడిమాల హరీష్, గోపికృష్ణలు గ్రూప్‌గా అసభ్య కార్యాకలాపాల్లో పాల్గొంటామని శ్రుతిక బాధితురాలికి చెప్పింది. ఈ గ్రూప్‌లో చేరడానికి ఆసక్తి ఉందా అంటూ ఆమె అడగడంతో బాధితురాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురై, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రుతిక బ్యాచ్‌తో కలవడానికి నిరాకరించడంతో.. ఆ తర్వాత లిఫ్ట్‌లో శ్రుతిక, నరేష్ నాయుడు కలిసి బాధితురాలిని అసభ్య పదజాలంతో దూషించారు.
ఆ సమయంలో నరేష్ నాయుడు బాధితురాలి పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎఫ్‌ఐఆర్ (FIR)లో నమోదైంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు బాధితురాలిని బెదిరించారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత.. జిమ్ బేస్‌మెంట్‌లో ట్రైనర్లు హరీష్, గోపీకృష్ణలు కూడా బాధితురాలిని వేధించినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించగా.. మరొకరు జుట్టు లాగి హింసించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 75(2), 351(2) r/w 3(5) కింద సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఉన్నతాధికారులు ఎస్‌ఐ అనూషకు అప్పగించారు.
ఈ వార్తలనూ చదవండి:
అయోధ్య నిధుల దుర్వినియోగం.. ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా..
సనాతన ధర్మ నమ్మకంతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం: CM యోగి ఆదిత్యనాథ్