హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి..
ABN , Publish Date - Jun 25 , 2026 | 06:43 PM
హైదరాబాద్‌లోని చందానగర్–లింగంపల్లి ప్రాంతంలో ఉన్న ది ఫుడ్ ప్లానెట్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, జూన్ 25: నగరంలోని చందానగర్–లింగంపల్లి ప్రాంతంలో ఉన్న ది ఫుడ్ ప్లానెట్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సైబరాబాద్ పరిధిలో జరిగిన ఈ తనిఖీల్లో రెస్టారెంట్‌కు 100కు 51 మార్కులు మాత్రమే లభించాయి. త్వరలో ఇంప్రూవ్‌మెంట్ నోటీస్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల సమయంలో రెస్టారెంట్‌లో పలు లోపాలు గుర్తించారు. ఎగ్జాస్టులు, సీలింగ్, పైప్‌లైన్లపై జిడ్డు పేరుకుపోయినట్లు అధికారులు గమనించారు. అలాగే పాడైన మటన్‌ను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అదేవిధంగా లేబుల్ లేకుండా నిల్వ చేసిన పెరుగును కూడా సీజ్ చేశారు.
మెడికల్ ఫిట్‌నెస్ రికార్డులు అందుబాటులో లేకపోవడం, అలాగే పెస్ట్ కంట్రోల్, వాటర్ టెస్టింగ్ సంబంధిత రికార్డులు లేకపోవడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాన్‌వెజ్ స్టోరేజ్ ఫ్రిజ్‌ల నిర్వహణలో కూడా లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఆహార హ్యాండ్లర్లు సరైన అప్రాన్లు ధరించకపోవడం, గోళ్లు కట్ చేయకుండా పనిచేయడం వంటి లోపాలు కూడా బయటపడ్డాయి. పరిశుభ్రత మెరుగుపరచాలని, ఆహార పదార్థాలకు సరైన లేబెలింగ్ తప్పనిసరిగా పాటించాలని రెస్టారెంట్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
Also Read:
తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి
టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..