మల్లన్నసాగర్‌ను కూల్చే కుట్ర
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:23 AM
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు
రిజర్వాయర్ కట్టను ధ్వంసం చేసే ప్రయత్నం
ఎలాంటి అనుమతుల్లేకుండా సమీపంలో పేలుళ్ల పనులు
మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం వెనుక కూడా కాంగ్రెస్ హస్తం ఉందన్న అనుమానాలు: హరీశ్‌రావు
గజ్వేల్/కుకునూరుపల్లి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామంలో హెచ్‌ఎండబ్ల్యూఎ్‌స ట్యాంక్ కోసమంటూ చేపడుతున్న పేలుడు పనులతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ కట్టను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. మల్లన్నసాగర్ వద్ద అనుమతులు లేకుండా జిలెటిన్ స్టిక్స్ పెట్టి రాత్రివేళల్లో బ్లాస్టింగ్ చేయడాన్ని చూస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. గతంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంలోనూ కాంగ్రెస్ వాళ్లే ఏదైనా చేశారా.. అనే అనుమానం కలుగుతోందన్నారు. ఈ విషయంపై అప్పట్లో ఇంజనీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. తిప్పారం గ్రామంలో ట్యాంక్ నిర్మాణం వద్ద చేసిన బ్లాస్టింగ్ పనులను, గ్రామంలో నెర్రెలు బారిన గోడలను, మల్లన్నసాగర్ కట్ట వద్ద సీపేజీని హరీశ్‌రావు గురువారం పరిశీలించారు. రిజర్వాయర్ కట్టకు కేవలం 150 నుంచి 200 మీటర్ల లోపల ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేయడం ఏంటని సైట్ ఇంజనీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక పోలీసు అధికారులను అడిగితే పరిశీలిస్తామంటున్నారని, రెవెన్యూ అధికారులు తమకేమీ తెలియదంటున్నారని చెప్పారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీనిపై వెంటనే సమీక్షించాలని అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్న అధికారులు, ఏజేన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు వెంట దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!
ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు