గుజ్జర్ గేదె @ రూ. 3.11 లక్షలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 07:16 AM
నగర శివారులోని నార్సింగ్ వ్యవసాయ మార్కెట్‌లో గుజ్జర్ జాతికి చెందిన గేదెకు అత్యధికంగా ధర పలికింది. దానిని రూ. 3.11 లక్షలకు విక్రయించారు. వివరాలిలా ఉన్నాయి.
వైభవంగా పశు సంక్రాంతి సంత
రికార్డు స్థాయిలో 11 గేదెల అమ్మకం
హైదరాబాద్: నార్సింగ్ వ్యవసాయ మార్కెట్(Narsing Agricultural Market)లో శుక్రవారం నిర్వహించిన పశుసంక్రాంతి సంతలో గుజ్జర్ జాతి గేదెలు రికార్డు స్థాయి ధర పలికాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రికార్డుస్థాయిలో 11 గేదెలు ఒక్కొక్కటి రూ. 3.11 లక్షల చొప్పున అమ్ముడుపోయాయి. పశు సంక్రాంతి సంతకు ఈసారి అత్యధికంగా పలు రాష్ట్రాల నుంచి గేదెలు వచ్చినప్పటికీ ఆర్థికమాంద్యం కారణంగా మార్కెట్ మందకొడిగా సాగింది. అయితే, ధర మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. నార్సింగ్‌కు చెందిన రైతులు సతీశ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిల గుజ్జర్ జాతి గేదెను భౌరంపేట్‌కు చెందిన రాజిరెడ్డి రూ.3.11 లక్షలకు కొనుగోలు చేశారు.
క్రితం ఏడాది ధూలియా గేదె రూ. 2.7లక్షలకు అమ్ముడు పోగా, ఈ యేడాది గుజ్జర్ గేదె అంతకుమించిన ధరకు అమ్ముడు పోయి రికార్డు సృష్టించింది. అలాగే జాఫ్రి, ధూలియా జాతికి చెందిన గేదెలు లక్షన్నర నుంచి రెండు లక్షలకుపైగా విక్రయించారు. ధూలియా, గుజ్జర్ హరియాణ, సోలాపూర్, ముర్రె గేదెలకు డిమాండ్ కనిపించింది. ఇక పుంగనూర్ ఆవులు, గుజరాత్‌కు చెందిన ఆవులు రూ.70వేల నుంచి లక్షన్నర వరకు అమ్ముడుపోయాయి.
గుజ్జర్ గేదె ప్రత్యేకత
రోజూ ఉదయం 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్ల చొప్పున పాలు ఇస్తుంది. ఇలా వరుసగా ఆరు నెలల పాటు పాలు ఇస్తుంది.
- సతీష్ రెడ్డి, గేదెను అమ్మిన రైతు, నార్సింగ్
ఈ వార్తలు కూడా చదవండి
మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..
జగన్ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత
Read Latest Telangana News and National News