Share News

గ్రిండర్ యాప్‌తో పరిచయాలు.. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్..

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:06 PM

గ్రిండర్ యాప్‌ను వేదికగా చేసుకుని పరిచయాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టు చేశారు.

గ్రిండర్ యాప్‌తో పరిచయాలు.. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్..
Online Blackmail

హైదరాబాద్, నవంబరు 16: సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లను ఆసరాగా చేసుకుని అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా.. గ్రిండర్ (Grindr) యాప్‌ ద్వారా పరిచయాలు పెంచుకుని.. అనంతరం బాధితులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టు చేశారు.

ఈ ముఠా సభ్యులు యాప్‌ ద్వారా బాధితులతో పరిచయం ఏర్పరచుకుని, వారిని నమ్మించి కలుసుకునేలా చేసేవారు. ఆ సమయంలో లేదా ఇతర సందర్భాల్లో వారి ఫొటోలు, ప్రైవేట్ వీడియోలను రహస్యంగా రికార్డు చేసేవారు. అనంతరం వాటిని బాధితులకు చూపించి, సోషల్ మీడియాలో లేదా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపిస్తామంటూ బెదిరింపులకు దిగేవారు. పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుందనే భయంతో బాధితులు డబ్బులు చెల్లించేలా ఒత్తిడి చేసేవారు. ఇలా పలువురిని లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.


ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న మల్కాజిగిరి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేపట్టారు. నిందితుల మోసపూరిత వ్యవహారాన్ని గుర్తించి, పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం ముఠా సభ్యులను అరెస్టు చేశారు. గ్రిండర్ యాప్‌ను వేదికగా చేసుకుని పరిచయాల పేరుతో వ్యక్తిగత వివరాలు సేకరించడం, ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడం వంటి చర్యలకు పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మకూడదని, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఇతర రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఈనెల 17న ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అధికారిక షెడ్యూల్ ఖరారు..

ఉద్యోగం కోసం మలేసియా వెళ్లి జైలుపాలైన కామారెడ్డి యువకుడు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 04:12 PM