Share News

అంత్యక్రియలకు హాజరై.. చెరువులో స్నానానికి వెళ్లి.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:01 AM

అంత్యక్రియలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరాల్సిన ఇద్దరు.. అదే రోజు విగతజీవులుగా మారిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అంత్యక్రియలకు హాజరై.. చెరువులో స్నానానికి వెళ్లి.. ఇద్దరి మృతి
Telangana News

సంగారెడ్డి, ఆగస్టు 13: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిన్నారం మండలం వావిలాల గ్రామంలో చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన గణేష్ (30), మునిరాజు (58) ప్రాణాలు కోల్పోయారు. అంత్యక్రియలు పూర్తయిన అనంతరం ఇద్దరూ చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో గణేష్‌కు ఒక్కసారిగా మూర్ఛ రావడంతో అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. చెరువులో మునిగిపోతున్న గణేష్‌ను గమనించిన మునిరాజు.. కాపాడేందుకు వెంటనే నీటిలోకి వెళ్లాడు. అయితే గణేష్‌ను రక్షించే ప్రయత్నంలో మునిరాజు కూడా నీటిలో మునిగిపోయాడు.


ఇద్దరూ చాలాసేపు బయటకు రాకపోవడంతో అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందడంతో స్థానికులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసినట్లు సమాచారం. అంత్యక్రియలకు హాజరైన కుటుంబాల్లో ఈ ఘటన మరో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:

ప్రైవేటు ఆస్పత్రుల్లో గది అద్దెలకు కళ్లెం.. పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ కీలక సిఫారసు..

రాహుల్ గాంధీ పక్కనున్న వారెవరు.. కేంద్ర మంత్రి ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం ఏంటంటే..

Updated Date - Aug 13 , 2026 | 11:30 AM