Hyderabad: ‘చైనా మాంజా’తో వృద్ధురాలికి తీవ్రగాయం..
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:47 AM
చైనా మాంజాపై నిషేధం ఉన్నా నగరంలోని కొన్ని ఏరియాల్లో ఇంకా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చైనా మాంజా వల్ల వృద్ధురాలికి తీవ్రగాయాలైన సంఘటన నగరంలోని అల్మాస్గూడలో జరిగింది. ఇందుకు సంబంధివచిన వివరాలిలా ఉన్నాయి.
- అల్మాస్గూడలో ఘటన
హైదరాబాద్: నిషేధిత చైనా మాంజా వల్ల వృద్ధురాలి కాలికి తీవ్రగాయమైంది. ఈ సంఘటన అల్మాస్గూడ(Almasguda)లో జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జీహెచ్‌ఎంసీ బడంగ్‌పేట్ సర్కిల్ నాదర్‌గుల్ డివిజన్‌లో ఉన్న అల్మా్‌సగూడకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు దిండు యాదమ్మ సోమవారం రాత్రి తమ ఇంటి ఎదుట నుంచి నడుచుకుంటూ వెళ్తున్నది. గాలి పటం నుంచి తెగిన చైనా మాంజా ఆమె కాలుకు చుట్టుకుంది.

కంగారులో దానిని తొలగించే ప్రయత్నంలో ఇదికాస్త లోతుగా తెగింది. తీవ్ర రక్తం కారుతున్న ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయాన్ని పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స అందించారు. చైనా మాంజా మార్కెట్లో లభించకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అరికట్టాలని బాధిత కుటుంబీకులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!
Read Latest Telangana News and National News