రక్షణ’ భూసేకరణకు మినహాయింపులు
ABN , Publish Date - Oct 09 , 2026 | 06:33 AM
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఐఆర్‌సీ) అవసరాలకు 48.10 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది.
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఐఆర్‌సీ) అవసరాలకు 48.10 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 10 ఏ, తెలంగాణ భూసేకరణ నిబంధనలు-2017లోని నిబంధన- 4 ప్రకారం మినహాయింపులు కల్పిస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో భూ సేకరణ చట్టంలోని చాప్టర్-2, చాప్టర్-3 పరిధిలోని నిబంధనల నుంచి మినహాయింపు లభించనుంది.
ఈ వార్తలనూ చదవండి:
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!