తనిఖీలకు ముందే సమాచారం లీక్.. హౌసింగ్ అధికారి సస్పెండ్
ABN , Publish Date - Nov 17 , 2026 | 09:10 PM
డబుల్ బెడ్ రూం ఇళ్ల తనిఖీలకు సంబంధించిన సమాచారం ముందుగానే లీక్ చేసిన వ్యవహారంలో హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ చంద్రపాల్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్, నవంబరు 17: డబుల్ బెడ్ రూం ఇళ్ల తనిఖీలకు సంబంధించిన సమాచారం ముందుగానే లీక్ చేసిన వ్యవహారంలో హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ చంద్రపాల్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. కొల్లూరులోని డబుల్ బెడ్ రూం ఇళ్లలో అసలైన లబ్ధిదారులు నివాసం ఉంటున్నారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీలకు సంబంధించిన సమాచారం ముందుగానే బయటకు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో తనిఖీల ఉద్దేశం దెబ్బతినేలా అధికారిక సమాచారం లీక్ చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు డీఈఈ చంద్రపాల్‌పై చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు, అధికారిక సమాచారాన్ని ముందుగానే లీక్ చేసినట్లు నిర్ధారించడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పథకం కింద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో అర్హులైన లబ్ధిదారులే నివాసం ఉంటున్నారా? లేదా? అనే అంశంపై తనిఖీలు జరుగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
మోదీ చాలా టఫ్.. మళ్లీ ట్రంప్ ప్రశంసలు
అమెరికా భీకర దాడులు చేసినా.. చెక్కుచెదరని ఇరాన్ రహస్య క్షిపణి నగరాలు..