Share News

మోదీ చాలా టఫ్.. మళ్లీ ట్రంప్ ప్రశంసలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:16 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ చాలా టఫ్ అని, సమర్థుడైన నాయకుడని కితాబునిచ్చారు.

మోదీ చాలా టఫ్.. మళ్లీ ట్రంప్ ప్రశంసలు
USA President Trump Praises PM Modi

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ చాలా టఫ్ అని, సమర్థుడైన నాయకుడని కితాబునిచ్చారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న 23వ ఆసియాన్ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ట్రంప్ అక్కడ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ఆసియాన్ సమావేశాల నేపథ్యంలో క్వాడ్ దేశాల కూటమి నేతలైన భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంతొనీ ఆల్బనీస్, జపాన్ ప్రధాని టకాయిచీతో కలిసి ట్రంప్ మరో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఫొటో దిగే సమయంలో మోదీ చాలా టఫ్ అని కామెంట్ చేశారు. ఆ తరువాత జపాన్ ప్రధాని వైపు చూస్తూ ఆమె ఇంకా టఫ్ అని అన్నారు.


ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ క్వాడ్ కూటమి ప్రపంచంలో అత్యంత విజయవంతమైన భాగస్వామ్యాల్లో ఒకటని అన్నారు. క్వాడ్ కూటమి దేశాలైన భారత్, అమెరికా, జపాన్ రేర్ ఎర్త్ ఖనిజాల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాయని అన్నారు. ‘మాకు కావాల్సినవి మేము 10 నెలల్లో సమకూర్చుకోగలము. రేర్ ఎర్త్ ఖనిజాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసుకుంటున్నాము. జపాన్, ఇండియా.. ఇలా మేమంతా ముందువరుసలోనే ఉన్నాము’ అని అన్నారు.


ప్రస్తుతం మూడు రోజుల ఆసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ తరువాత చైనాలో కూడా పర్యటిస్తారు. అక్కడ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం అవుతారు. ఈ పర్యటనలో ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో కూడా సమావేశమయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఆసియాన్ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. నవంబర్ 15న ప్రారంభమైన ఆసియాన్ వార్షిక సమావేశాలు నేటితో ముగుస్తాయి.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికా భీకర దాడులు చేసినా.. చెక్కుచెదరని ఇరాన్ రహస్య క్షిపణి నగరాలు..

స్కీయింగ్ చేస్తూ జూ ఏ.. సిగరెట్‌తో కిమ్ జోంగ్ ఉన్.. వైరల్‌గా మారిన ఫొటోలు

Updated Date - Nov 17 , 2026 | 05:53 PM