16 జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:01 AM
రాష్ట్రంలో చలి విజృంభణ మొదలైంది.
రాష్ట్రంలో చలి విజృంభణ మొదలైంది. చాలా చోట్ల రాత్రిపూట కనిష్ఠ ఉషోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం రాత్రి మొత్తం 16 జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 14.7 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండలో కనిష్ఠ ఉష్ణోగ్రత 14.7 డిగ్రీలుగా నమోదయినట్టు పేర్కొంది. ఈ నెల 16 వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని, ప్రత్యేక హెచ్చరికలు ఏమీ లేవని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లికి 4 లక్షల మంది.. ప్రధాని మోదీకీ ఆహ్వానం!
ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో యూపీ పట్టణం లోనీ