CM Revanth: ముంబైలో న్యాయవాదితో సీఎం రేవంత్ భేటీ.. ఎందుకంటే..
ABN , Publish Date - Jan 04 , 2026 | 08:53 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. దీనిపై రేపు వాదనలు జరగనున్నందున ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తో..
ఆంధ్రజ్యోతి, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో జనవరి 5 2026న సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి.

దీనికి ముందుగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్' పోస్ట్‌లో ఈ వివరాలు పంచుకుంది.
తెలంగాణ పిటిషన్‌లో ప్రధాన ఆరోపణలు..
సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) అనుమతులు లేకుండా DPR సన్నాహాలు, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉల్లంఘనలు, తెలంగాణలో ముంపు ప్రమాదం. అలాగే ఈ ప్రాజెక్టు పోలవరం డ్యామ్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి నల్లమల్ల సాగర్‌కు తరలించేలా రూపొందించారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఈ ప్రాజెక్టులు తెలంగాణకు హానికరమని, న్యాయస్థానంలో తగిన ఆధారాలతో పోరాడుతామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎయిర్ పోర్ట్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: ఎంపీ కలిశెట్టి
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
For More AP News And Telugu News