Share News

రహదారుల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష..

ABN , Publish Date - Mar 11 , 2026 | 09:12 PM

తెలంగాణ రాష్ట్ర రూపురేఖలను మార్చే విధంగా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రవాణా, వైద్య రంగాల్లో భారీ మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళితే..

రహదారుల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష..
Revanth Reddy Road Sector Policy 2047

హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ రాష్ట్ర రూపురేఖలను మార్చే విధంగా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రవాణా, వైద్య రంగాల్లో భారీ మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శ్రీకారం చుట్టారు. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో(Review meeting) ‘రోడ్ సెక్టార్ పాలసీ-2047’ లక్ష్యంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం(Hyderabad city) నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల నెట్ వర్క్ ను అభివృద్ది చేయాలని అన్నారు. నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో వీపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ట్రాఫిక్ కష్టాల(Traffic problems) నుంచి విముక్తి చేయడానికి కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్య ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాలలో పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులకు సూచించారు.


రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటికీ ఒక రింగ్ రోడ్డు నిర్మించి, వాటిని జాతీయ రహదారులతో(Highways) అనుసంధానించాలని సీఎం తెలిపారు. దీని వల్ల జిల్లాల ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు. రోడ్ల అభివృద్ధి పనుల్లో భూ సేకరణ వంటి అడ్డంకులు కలగకుండా GHMC, రెవెన్యూ విభాగాల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తకుండా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని, దీనిపై సాధ్యాసాధ్యాలు నిశితంగా అధ్యయనం చేయాలని సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఇక పేద ప్రజలకు అత్యాధునిక వైద్యం చేరువ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని టీచింగ్ హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రుల పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచి, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

సభలో మాట్లాడే అవకాశం రాహుల్‌కి ఇవ్వలేదు: ఎంపీ మల్లు

ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. తెలంగాణకు మచ్చ: బీజేపీ ఎంపీ

Updated Date - Mar 11 , 2026 | 09:12 PM