కొడంగల్‌లో దసరా సమ్మేళనం
ABN , Publish Date - Oct 23 , 2026 | 03:27 AM
దసరా పండుగను పుర స్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ప్రజలను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మీయ పలకరింపు
మహాలక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులపై ఏరియల్ సర్వే
సీఎం రాకతో భారీగా తరలివచ్చిననాయకులు, కార్యకర్తలు
కొడంగల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగను పుర స్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ప్రజలను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా దసరా పండుగ తర్వాతి రోజు ఆయన తన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 2:15 గంటలకు కొడంగల్‌కు చేరుకున్నారు. పట్టణంలో తాండూరురోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు దీపక్ తివారీ, ప్రియాంక, ఎస్పీ స్నేహా మెహ్రా, వివిధ శాఖలఅధికారులు, కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం నేరుగా కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శాస్త్రోక్తంగా నాణ్యతాయుతంగా పనులు చేపట్టాలన్నారు. అధికారులకు, నిర్మాణదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కొడంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన దసరా సమ్మేళన కార్యక్రమంలో తనను కలిసేందుకు వచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. సుమారు రెండు గంటలపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. సీఎంను కలిసేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
కాగా, కొడంగల్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి వస్తూ మార్గమధ్యంలో హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు. వివిధ విద్యాసంస్థల నిర్మాణం పనుల పురోగతి గురించి అధికారులను ఆరా తీశారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశించినగడువులోగా పూర్తి చేసేలా పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?
భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!