Share News

యాదాద్రి జిల్లాలో దారుణం.. కిలో బంగారం కోసం వ్యక్తి హత్య..

ABN , Publish Date - Nov 01 , 2026 | 07:10 AM

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కండేయ నగర్ కాలనీలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

యాదాద్రి జిల్లాలో దారుణం.. కిలో బంగారం కోసం వ్యక్తి హత్య..
Yadadri Bhuvanagiri

యాదాద్రి భువనగిరి, నవంబర్ 1: జిల్లాలో దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కండేయ నగర్ కాలనీలో జోగిని రాళ్లబండి సుధాకర్ (48)ను గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సుధాకర్ స్వామిని కాళ్లు, చేతులు కట్టేసి హతమార్చిన నిందితులు.. అనంతరం ఆయన వద్ద ఉన్న భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. సుమారు కిలో బంగారం, అర కిలో వెండి ఆభరణాలను అపహరించడంతో పాటు, మృతుడికి చెందిన కారును సైతం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీయడంతో పాటు జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.


సిద్దిపేట సమీపంలో నిందితుల పట్టివేత..

హత్య అనంతరం స్వామి కారుతో పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అస్సాంకు చెందిన దుండగులుగా గుర్తించిన పోలీసులు.. వారు కారులో వెళ్తున్న క్రమంలో సిద్దిపేట సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు హత్య జరిగిన విషయం తెలుసుకున్న ఎస్పీ అక్షాంష్ యాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. హత్యకు గల అసలు కారణాలు ఏమిటి? నిందితులు సుధాకర్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? దోపిడీ కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. భారీ మొత్తంలో ఆభరణాల అపహరణ, మృతుడిని కాళ్లు చేతులు కట్టేసి హతమార్చిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.


ఇవీ చదవండి

ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. మెరుపు వేగంతో దూసుకొచ్చిన బైక్..

షాపింగ్ పేరుతో నగల చోరీ.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

Updated Date - Nov 01 , 2026 | 09:03 AM