Chicken Price Today: బాబోయ్.. చికెన్ ధర ఇంతనా..!?
ABN , Publish Date - Jan 10 , 2026 | 10:55 AM
కోడి మాంసం ధర ఆకాశాన్ని తాకుతోంది. దీంతో సామాన్యులు, పేదలు చికెన్ తినడానికి భయపడుతున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగి కోళ్లు మృత్యువాత పడ్డ సమయంలోనూ ఇంతలా ధరలు ఎప్పుడూ లేవు. మొట్టమొదటి సారిగా..
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : కోడి మాంసం ధర ఆకాశాన్ని తాకుతోంది. దీంతో సామాన్యులు, పేదలు చికెన్ తినడానికి భయపడుతున్నారు. స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ.320 ధర పలుకుతోంది. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగి కోళ్లు మృత్యువాత పడ్డ సమయంలోనూ ఇంతలా ధరలు ఎప్పుడూ లేవు. మొట్టమొదటి సారిగా కిలో రూ.300 దాటిందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.200 ఉండేది. అది ప్రస్తుతం రూ.320కి పెరిగింది. గతంలో స్కిన్‌తో కిలో రూ.240తో విక్రయిస్తే.. ఇప్పుడు అది కూడా రూ.300కు చేరింది. ఇది వరకు బాయిలర్ కోడి కిలో రూ.140కి విక్రయిస్తే, ప్రస్తుతం రూ.200కు చేరుకుంది. మరో పక్క ఫారమ్ కోడి గతంలో రూ.120 ఉండేది. దానికి రూ.100 అదనంగా పెంచి రూ.220కి అమ్ముతున్నారు.
కోడిగుడ్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. కోడిగుడ్డు ధర ఒక్కటి రూ.6 ఉంటే ఆది కాస్తా రూ.8కి చేరుకుంది. గతంలో 30 కోడి గుడ్లు (కేస్)కు రూ.180 ఉంటే అది రూ.240కు విక్రయిస్తున్నారు. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇంటింటికీ చికెన్‌ను పంచడం, మందుపార్టీలకు చికెన్ వాడకం పెరగడంతో ప్రస్తుతం డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేక ధరలు పెరిగినట్టు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో చికెన్ ధర పడిపోతుందా? లేక ఇలాగే పెరుగుతుందా? అని సామాన్యులు ఆలోచిస్తున్నారు.
Also Read:
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..
వామ్మో.. ఇదెక్కడి ట్యాలెంట్ రా నాయనా.. ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూడండి..
చైనా మాంజా విక్రయాలపై ‘స్పెషల్’ డ్రైవ్