Share News

Boy puts wire in ear: వామ్మో.. ఇదెక్కడి ట్యాలెంట్ రా నాయనా.. ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Jan 10 , 2026 | 10:30 AM

ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే పనులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఏ మారుమూల ఏ అద్బుతం చేసినా అది క్షణాల్లో లక్షలాది మందికి చేరిపోతోంది. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Boy puts wire in ear: వామ్మో.. ఇదెక్కడి ట్యాలెంట్ రా నాయనా.. ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూడండి..
boy puts wire in ear

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే పనులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఏ మారుమూల ఏ అద్బుతం చేసినా అది క్షణాల్లో లక్షలాది మందికి చేరిపోతోంది. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (strange viral video).


@manz39754 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియలో ఓ బాలుడు విచిత్రమైన విన్యాసాన్ని ప్రదర్శించాడు. ఆ బాలుడు తన చెవిలో సన్నని తీగ లాంటి వస్తువును ప్రవేశపెట్టాడు. అనంతరం దానిని ముక్కు ద్వారా బయటకు తీశాడు. ఆ విన్యాసాన్ని చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ విన్యాసం తర్వాత కుర్రాడు ఎలాంటి నొప్పినీ ఫీలవకుండా హాయిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు (ear to nose viral video).


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (dangerous stunts video). ఆ వీడియో చూసిన నెటిజన్లు అందరూ షాకవుతున్నారు. కొద్ది గంటల్లోనే ఆ వీడియోను 77 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈ ఫీట్ చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారని ఒకరు కామెంట్ చేశారు. ఇది ఆ కుర్రాడికి దేవుడిచ్చిన ప్రత్యేక బహుమతని మరొకరు ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయేంటి.. ఆసక్తికర కారణాలు తెలిస్తే..

నేను ఉన్నంత కాలం చైనా ఆ పని చేస్తుందనుకోను: డొనాల్డ్ ట్రంప్

Updated Date - Jan 10 , 2026 | 11:23 AM